YSR Rythu Bharosa, PM Kisan - Eligibility, Payment Status

YSR Rythu Bharosa PM Kisan eligibility, Payment status check, rythu bharosa third list, how to apply for rythu bharosa and PM Kisan

YSR Rythu Bharosa PM Kisan వై.యస్.ఆర్ రైతు భరోసా - పి.ఎం. కిసాన్

సాగు సమయంలో రైతుల ఆర్థిక సమస్యలను తగ్గించి అధిక ఉత్పత్తి సాధించుటకై ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ. 13,300/- పెట్టుబడి సహాయం ఐదు సంవత్సరాలలో మొత్తం పెట్టుబడి సహాయం రూ. 67,500/-.

YSR Rythu Bharosa PM Kisan


వై.యస్.ఆర్ రైతు భరోసా అర్హతలు: YSR Rythu Bharosa Eligibility

  • వెబ్ లాండ్ డేటా ఆధారంగా భూమి పరిమాణంతో సంబంధం లేకుండా రైతుల గుర్తింపు,
  • ఆర్.ఓ.ఎఫ్.ఆర్ మరియు డి పట్టా భూములను (సంబంధిత రికార్డులలో నమోదైన వాటిని సాగుచేయుచున్న రైతు కుటుంబాలు.
  • పరిహారం చెల్లించకుండా స్వాధీనం చేసుకున్న భూములను సాగు చేస్తున్న రైతులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకి చెందిన సొంత భూమి లేని సాగుదారులు, వ్యవసాయ, ఉద్యానవన మరియు పట్టు పరిశ్రమ పంటలను కనీసం ఒక ఎకరం, పువ్వులు మరియు పశుగ్రాస పంటలు కనీసం 0.5 ఎకరం లేదా కనీసం 0.1 ఎకరం తమలపాకు సాగు చేయుచున్నచో అట్టి సాగుదారులు అర్హులు.
  • ఒక భూ యజమానికి ఒకరి కన్నా ఎక్కువ మంది కౌలు రైతులు ఉంటే, అందులో మొదటి ప్రాధాన్యత షెడ్యూల్డ్ తెగకు చెందిన కౌలు రైతుకు ఇవ్వబడుతుంది. తరువాత ప్రాధాన్యతా క్రమంలో షెడ్యూల్డ్ కులం, వెనకబడిన మరియు మైనారిటీ తరగతికి చెందినవారు ఉంటే వారికి ఇవ్వబడుతుంది.
  • గిరిజన ప్రాంతాలలో, గిరిజన చట్టాలు ఆధారంగా గిరిజన సాగుదారులను మాత్రమే గుర్తించటం జరుగుతుంది.
  • > ఒకే ఊరిలో ఉన్న సన్న కారు రైతు మరియు భూమి లేని సాగుదారుల మధ్య గల కౌలు ఒప్పందం చెల్లదు..
  • దేవాదాయ శాఖ నమోదుల ఆధారంగా దేవాదాయ భూములను సాగు చేస్తున్న సాగుదారులు లబ్దిని పొందడానికి అర్హులు.
  • రైతు కుటుంబంలో పెళ్ళికాని ప్రభుత్వ ఉద్యోగులు లేదా ఆదాయ పన్ను చెల్లించేవారు ఉన్నాకూడా సంబంధిత రైతు మినహాయింపు వర్గంలో లేకపోతే అతను వై.యస్.ఆర్ రైతు భరోసాకి అర్హుడు.

జాబితాలో పేరు లేని వారు దరఖాస్తు చేసుకునే విధానము: How to Apply YSR Rythu Bharosa

  • పట్టాదారు పాసుబుక్కు ఆధారంగా అర్హులైన భూమి గల రైతులను గుర్తించటం జరుగుతుంది.
  • భూమి లేని సాగుదారులను పంటసాగుదారుల హక్కు పత్రం ఆధారంగా గుర్తించటం జరుగుతుంది.
  • ఇతర వివరాలకు స్వయంగా రైతు భరోసా కేంద్రాలలో కానీ గ్రామ / వార్డు సచివాలయంలో సంప్రదించవలెను.
  • అర్హులైన దరఖాస్తుదారునికి YSR (Your Service Request - మీ సేవల అభ్యర్ధన) నెంబర్ ఇవ్వబడుతుంది.

Schemes

Post a Comment

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.