వైయస్సార్ కళ్యాణమస్తు/ వైయస్సార్ షాదీ తోఫా పథకము
మన రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్.టి, బీ.సీ, ముస్లింలు & ఇతర మైనారిటీలు మరియు వెల్ఫేర్ బోర్డు నందు రిజిస్టర్ కాబడిన భవన & ఇతర నిర్మాణ కార్మికుల కుటుంబాలకు చెందిన పెండ్లి కుమార్తెలు మరియు వారి కుటుంబాలకు వివాహం నిమిత్తం ఆర్థిక సహాయం అందించేందుకు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తుంది.
అర్హతలు
- పెండ్లి కుమార్తె కు 18 సంవత్సరాలు, పెండ్లి కుమారుడుకు 21 సంవత్సరాలు వయస్సు వివాహ తేదీ నాటికి పూర్తయి ఉండాలి.
- పెండ్లి కుమారుడు మరియు పెండ్లి కుమార్తె పదవ తరగతి పరీక్షలు ఉత్తీర్ణులై ఉండాలి.
- ఇరు కుటుంబాలు బిపిఎల్ కేటగిరీకి క్యాటగిరికి చెందినవై ఉండాలి.
- 01.10.2022 తేదీ నుంచి జరిగిన వివాహాలను పరిగణలోనికి తీసుకోవాలి.
ఆర్థిక సహాయం వివరాలు
- పెండ్లి కుమార్తెను ప్రాతిపదికగా తీసుకుని ఈ పథకంలో సహాయం అందజేయడం జరుగుతుంది.
- పెండ్లి కుమార్తె ఎస్సీ కేటగిరికి చెంది, అదే కేటగిరీకి చెందిన పెండ్లి కుమారుని వివాహం చేసుకుంటే Rs 1,00,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుంది.
- అదేవిధంగా పెండ్లి కుమార్తె ఎస్సీ కేటగిరికి చెంది, పెండ్లి కుమారుడు ఎస్సీ కేటగిరికి చెందిన వారు కాకుండా, మిగతా కేటగిరీకి సంబంధించిన వ్యక్తి అయి ఉంటే, అటువంటి వివాహాన్ని ఎస్సీ ఇంటర్ క్యాస్ట్ వివాహం గా పరిగణించి Rs 1,20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుంది.
- పెండ్లి కుమార్తె ఎస్.టి కేటగిరికి చెంది, అదే కేటగిరీకి చెందిన పెండ్లి కుమారుని వివాహం చేసుకుంటే Rs 1,00,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుంది.
- అదేవిధంగా పెండ్లి కుమార్తె ఎస్.టి కేటగిరికి చెంది, పెండ్లి కుమారుడు ఎస్.టి కేటగిరికి చెందిన వారు కాకుండా, మిగతా కేటగిరీకి సంబంధించిన వ్యక్తి అయి ఉంటే, అటువంటి వివాహాన్ని ఎస్.టి ఇంటర్ క్యాస్ట్ వివాహం గా పరిగణించి Rs 1,20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుంది.
- పెండ్లి కూతురు బి.సి. కులాలకు చెంది, అదే కేటగిరీకి చెందిన పెండ్లి కుమారుని వివాహం చేసుకుంటే Rs 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుంది.
- అదేవిధంగా బీ.సీ. కేటగిరీకి చెందిన పెండ్లి కూతురు బీ.సీ. క్యాటగిరి కాకుండా, ఇతర కులాలకు చెందిన పెండ్లి కుమారుని వివాహం చేసుకుంటే, బి.సి. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ గా పరిగణించి Rs 75,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుంది.
- అలాగే మైనార్టీలకు సంబంధించిన పెండ్లి కుమార్తె అదే క్యాటగిరి కి సంబంధించిన పెండ్లి కుమారుని వివాహం చేసుకుంటే Rs 1,00,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుంది.
- భవన మరియు ఇతర నిర్మాణ రంగాలలో పనిచేసే కార్మికుల కుటుంబానికి సంబంధించిన పెండ్లి కుమార్తె వివాహానికి Rs 40,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుంది. అయితే పెండ్లి కుమార్తె గాని, వారి తల్లిదండ్రులు గాని సంబంధిత వెల్ఫేర్ బోర్డు నందు రిజిస్టర్ అయి ఉండాలి.
- వికలాంగుల కేటగిరి విషయానికొస్తే, పెండ్లి కుమారుడు మరియు పెండ్లికుమార్తె లలో ఇరువురు వికలాంగులైన లేదా ఏ ఒక్కరు వికలాంగులైన Rs 1,50,000 రూపాయలు వారి వివాహానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తుంది.
గమనిక:
వివాహ తేదీ నుంచి 60 రోజులలోపు దరఖాస్తు చేసుకోవాలి.
Category |
Financial
Assistance under YSR Kalyanamasthu & YSR Shaadi Tohfa |
Shedule Caste |
100000/- |
Shedule Caste – Inter Caste |
120000/- |
Schedule Tribe |
100000/- |
Schedule Tribe – Inter Caste |
120000/- |
Backward Classes |
50000/- |
Backward Classes – Inter Caste |
75000/- |
Minorities |
100000/- |
Differently Abled |
150000/- |
BOCWWB |
40000/- |
వైఎస్సార్ కళ్యాణమస్తు/షాది తోఫా కు సంబంధించి ముఖ్యమైన సూచనలు...
- వివాహం అయిన 60 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి
- పెళ్లి కొడుకు/పెళ్లి కూతురు వారు ఎక్కడ నుండి దరఖాస్తు చేసుకున్న కానీ పెళ్లి కూతురు ఏ సచివాలయంకు MAP అయి ఉన్నారో ఆ సచివాలయం WEA/WWDS NBM లాగిన్ లో ENABLE అవుతాది కాబట్టి పెళ్లి కూతురు ఉన్న సచివాలయంలోనే దరఖాస్తు చేసుకుంటే WEA/WWDS తదుపరి వెరిఫికేషన్ కు సులువు అవుతుంది.
- పెళ్లి కొడుకు మరియు పెళ్లి కూతురు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు అయి ఉండాలి మరియు HH MAPPING లో ఉండి ఉండాలి మరియు ఇక్కడ మాత్రమే రైస్ కార్డ్ కలిగి ఉండాలి. ‼️
- అక్టోబర్ 1, 2022 తర్వాత చేసుకునే వివాహాలకు మాత్రమే లబ్ధి పొందుతారు
- ప్రతి 3 నెలలకు ఒకసారి అర్హులు అయిన వారికి వారి బ్యాంక్ ఖాతాలో అమౌంట్ జమ చేస్తారు
- Ex: ప్రతీ సంవత్సరం FEB/MAY/AUGUST/NOVEMBER నెలలో అమౌంట్ క్రెడిట్ అవుతాది.
- NBM WEBSITE లో DA/WEDPS LOGIN లో మాత్రమే APLPY చేయాలి
- పెళ్లి కొడుకు మరియు పెళ్లి కూతురు సచివాలయంకు వచ్చి BIO METRIC వేయాలి
కొత్త దరఖాస్తుకు అవసరం అయిన డాక్యుమెంట్స్
- పెళ్ళి కొడుకు మరియు పెళ్లి కూతురు యొక్క కుల ధృవీకరణ పత్రం. (AP SEVA PORTAL ద్వారా జారీ చేసింది మాత్రమే)
- పెళ్ళి కొడుకు మరియు పెళ్లి కూతురు యొక్క ఆదాయ ధృవీకరణ పత్రం. (AP SEVA PORTAL ద్వారా జారీ చేసింది మాత్రమే)
- పెళ్ళి కొడుకు మరియు పెళ్లి కూతురు యొక్క 10వ తరగతి pass certificate (HALL TICKET NUMBER ఎంటర్ చేయాలి)
- వివాహ ధృవీకరణ పత్రం (AP SEVA PORTAL ద్వారా APPLY చేసింది)
- వికలాంగులు అయితే SADAREM CERT కలిగి ఉండాలి మరియు ఏ cast అయినా కానీ వాళ్ళు అర్హులు(పెళ్ళికొడుకు/పెళ్లి కూతురు)
- WIDOW అయితే HUSBAND DEATH CERTIFICATE/WIDOW PENSION CARD/AFFIDAVIT
- భవన నిర్మాణ కార్మికులు అయితే BOCWWB కార్డ్ ఉండాలి మరియు ఏ క్యాస్ట్ వారు అయిన అర్హులు.