Fever Survey 2023 by GSWS Volunteer Complete Process

ఆశా వర్కర్స్ , వాలంటీర్లు, ఏఎన్ఎం ల ద్వారా ఇంటింటికీ ఫీవర్ సర్వే చేపట్టాలి. జ్వర భాదితుల కోసం ప్రత్యే క ఓపీ సదుపాయాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర వైద్య ,

H3N2 అంటే ఏమిటి?

H3N2 ఇన్ఫ్లుఎంజా వైరస్ మానవులలో వ్యాధిని కలిగించే అనేక రకాల ఇన్ఫ్లుఎంజా వైరస్లలో ఒకటి. H3N2 అనేది వైరల్ జాతి ఇన్ఫ్లుఎంజా వైరస్ A యొక్క ఉపరకం , ఇది మానవ ఇన్ఫ్లుఎంజాకు ముఖ్య మైన కారణం . దీని పేరు దాని కోటు ఉపరితలం పై ఉండే రెండు రకాల ప్రొటీన్ల రూపాల నుండి వచ్చింది, హేమాగ్గ్లుటినిన్ (H) మరియున్యూరామినిడేస్ (N). దీనిమూలాలు, భారతదేశం లోఇప్పటి వరకు మొత్తం 90 H3N2 ఇన్ఫ్లు ఎం జా కేసులు నమోదయ్యా యి. H3N2 కాకుండా, దేశం లో ఎనిమిది H1N1 ఇన్ఫ్లుఎంజా కేసులు కూడా నమోదయ్యాయి.


Fever Survey 2023


H3N2 యొక్క లక్షణాలు

H3N2యొక్క ఫ్లూ లక్షణాలు ఇతర కాలానుగుణ ఇన్ఫ్లుఎంజా వైరస్లతో పోల్చవచ్చు. ఇవి ఇతర వైరల్ ఇన్ఫెక్షన్ల లక్షణాలను పోలి ఉన్నప్పటికీ, ఈ లక్షణాలను ఎప్పటికీ విస్మరించకూడదు.

  • శరీర నొప్పి
  • చలి, జ్వరం
  • అలసట
  • అతిసారం
  • వాంతులు
  • దగ్గు
  • ముక్కు కారడం లేదా మూసుకుపోవడం
  • గొంతు నొప్పి
  • తలనొప్పి
ఆశా వర్కర్స్ , వాలంటీర్లు, ఏఎన్ఎం ల ద్వారా ఇంటింటికీ ఫీవర్ సర్వే చేపట్టాలి. జ్వర భాదితుల కోసం ప్రత్యే క ఓపీ సదుపాయాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర వైద్య , ఆరోగ్య శాఖ ఆదేశం . వారం లో ఐదు రోజులపాటు నాణ్య త ప్రమాణాలతో ఫీవర్ సర్వే నిర్వ హిం చాల్సి ఉం దిగా అన్ని జిల్లాల మెడికల్ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేశారు.

వాలంటీర్ APP లో ఫీవర్ సర్వే చేయు విధానం

సర్వే ను GSWS Volunteer మొబైల్ అప్లికేషన్ లో చేయాలి. మొబైల్ అప్లికేషన్ కింద లింక్ ద్వారా Download చేసుకోవాలి.

GSWS Volunteer APP  V6.1.9👉   Volunteer App


Step 1: మొబైల్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తరువాత వాలంటీర్ ఆధార్ నెంబర్ తో లాగిన్ అవ్వాలి.

Step 2: లాగిన్ అయిన తరువాత Services Delivery ఆప్షన్ పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తరువాత Covid-19 Survey (2022) / కోవిడ్ - 19 సర్వే (2022) ఆప్ష న్ పై క్లిక్ చేయాలి.

Step 3: Screening Pending మరియు Screening Completed అనే రెండు ఆప్షన్ లు ఉంటాయి. అందులో Screening Pending లో సర్వే చేయవలసిన లేదా సర్వే పెండింగ్ పేర్లు మరియు Screening Completed లో సర్వే పూర్తి అయిన పేర్లు ఉంటాయి. సర్వే మొదలు చేయుటకు Screening Pending పై క్లిక్ చేయాలి.

Step 4: Screening Pending పై క్లిక్ చేసిన తరువాత క్లస్టర్ లో ఉన్నా కుటుంబాల పేర్లు అన్ని వస్తాయి. పేరుతో కూడా Search చేయవచ్చు. దానికి Search With Name ఆప్షన్ ను ఉపయోగించుకోవాలి.

Step 5: సర్వే చేసే కుటుంబం పేరు పై క్లిక్ చేయాలి. పేరు పై క్లిక్ చేసా క, "మీ ఇంట్లో ఎవరికి అయిన అనారోగ్యం ఉందా?" అనే ప్రశ్న కు అనారోగ్యం ఉంటే "ఉంది" అని లేకపోతే "లేదు" అని సెలెక్ట్ చేయాలి.

Step 6: పై విధంగా సెలెక్ట్ చేసిన తరువాత “కుటుంబ సభ్యుల వివరాలు" చూపిస్తాయి. అందులో కుటుంబం లో ఉన్నా అందరి పేర్లు చూపిస్తాయి. ఎవరికి అయిన సమస్య ఉంటే వారికి "అనారోగ్యం ఉన్న వారు" ను సెలెక్ట్ చేయాలి. అప్పుడు సమస్యల లిస్ట్ చూపిస్తుంది. అందులో వారికి ఏ సమస్యలు ఉన్నాయో సెలెక్ట్ చేయాలి.

  • జ్వరం
  • పొడి దగ్గు
  • నొప్పులు మరియు బాధలు
  • అలసట
  • గొంతు మంట
  • అతి సారం
  • కండ్ల కలక
  • చాతి నొప్పి మరియు ఒత్తిడి
  • రుచి లేదా వాసన కోల్పోవడం
  • చర్మం పై దురద
  • తలనొప్పి
  • కాలు వేళ్ళు రంగు మార్పు
  • శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది
  • కదలిక కోల్పోవటం

పై వాటిని సెలెక్ట్ చేయాలి.

స్మా ర్ట్ ఫోన్ ఉన్న వారు - స్మా ర్ట్ మొబైల్ ఫోన్ వాడినట్లు అయితే టిక్ చేయాలి.

ఈ-సంజీవని అప్లికేషన్ డౌన్లోడ్ చేసినవారు - ఎవరి స్మార్ట్ మొబైల్ లో eSanjeevani అనే మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేస్తే అక్కడ టిక్ చేయాలి.

ఈ-సం జీవని అప్లికేషన్ వాడినవారు - ఈసం జీవని మొబైల్ అప్లికేషన్ తరచుగా వాడుతుంటే అప్పుడు టిక్ చేయాలి.

టీకా తీసుకున్నారా - కోవిడ్ వాక్సిన్‌ తీసుకుంటే టిక్ చేయాలి. లేదంటే వదిలి వేయాలి.

1వ టీకా తీసుకున్నారా - మొదటి డోస్ వాక్సిన్ వేసుకుంటే టిక్ చేయాలి. లేదంటే వదిలి వేయాలి.

2వ టీకా తీసుకున్నారా - రెం డవ డోస్ వాక్సిన్ వేసుకుం టే టిక్ చేయాలి. లేదంటే వదిలి వేయాలి.

టీకా తీసుకున్న తేదీ - 1వ లేదా 2వ టీకా తీసుకున్న తేదీ గుర్తు ఉంటే ఆ తేదీ వేయాలి.

Step 7: పై వివరాలు అందరికి ఎంటర్ చేసిన తరువాత Mobile లో సర్వే చేసిన అంత సేపు లొకేషన్ ఆన్ లోనే ఉంచుకోవాలి. Capture Latlng పై క్లిక్ చేస్తే లొకేషన్ తీసుకుంటుంది. తరువాత SUBMIT పై క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లస్టర్ లో ఉన్న వారందరికీ సర్వే పూర్తిచేయాలి.


Fever Survey Report Dash Board 👉    Fever Survey Report

Post a Comment

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.